Pages

16, మే 2015, శనివారం

తెల్ల వాళ్ళ రోజులు గుర్తుకు వచ్చాయి.



ఇవాళే పేపర్ లో చూశాను,ప్రధాని మోడీ ఇటీవల కాలం లో చత్తీస్ ఘడ్ రాష్ట్రం వెళ్ళినపుడు సరైన డ్రెస్ కోడ్ పాటించకుండా ముదురు నీలం రంగు షర్టు వేసుకొని,సన్ గ్లాసెస్ పెట్టుకొని అక్కడి ఇరు జిల్లా కలెక్టర్లు ప్రధాని కి ఆహ్వానం పలికారట.కాగా అలాంటి డ్రెస్ లో నల్ల చలువ అద్దాలు ధరించి ప్రధాని ని రిసీవ్ చేసుకోవడం ఆ ఉద్యోగుల కోడ్ కి కూడా వ్యతెరేకమట.కావున చత్తిస్ ఘడ్ రాష్ట్రం వారికి శ్రీముఖాలు ఇచ్చిందట.అదీ సారం.ఎన్ని ఏళ్ళు గడిచిన బ్రిటిష్ వారి సాంప్రదాయ ధోరణులు కొన్ని మన పాలనలో వదల లేదే అనిపిస్తోంది. కొన్ని పాత తరం డైరీలు చదువుతుంటే కూడా అక్కడక్కడ తగులుతుంటాయి.ఎవరైనా పౌరులు ఆ రోజుల్లో కలెక్టర్ ని (తెల్ల కలెక్టర్) ని కలవాలనుకుంటే ఖచ్చితం గా బూట్లు,కోటు,తలపాగా ధరించి వెళ్ళవలసిందేనట.అంతేకాదు మన జమీందార్లు వైస్రాయ్  ని కలవాలన్నాకూడా ఇలానే కొన్ని తంతులు పాటించేవారు. లేకపోతే తమను గౌరవించనట్లు భావించేవాళ్ళుట.ఆ ఉదంతం లు గుర్తుకొచ్చాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి