Pages

11, మే 2015, సోమవారం

కాని ఈ లెక్కని ఘనత వహించిన మన దిన పత్రికలు చూపించవు

ఆర్.టి.సి.వాళ్ళు ప్రస్తుతం 43 శాతం ఫిట్మెంట్ ఇమ్మని సమ్మె చేస్తున్నారు.అలాగే మిగతా ఉద్యోగులు సమ్మె చేస్తుంటారు.కాని ఇలాంటప్పుడు మనకి ఉన్న కొన్ని ప్రధాన పత్రికలు రెచ్చిపోయి జీతాలు పెంచినట్లయితే ప్రతి ఏటా 100 కోట్లు లేదా 200 కోట్లు అదనంగా భారం పడుతుందని, ప్రజా ధనం వృధా అవుతుందని గగ్గోలు పెడుతుంటారు.విచిత్రంగా ప్రభుత్వానికి వచ్చే అనేక రకాల రెవెన్యూలను,పన్నులను ఏటా ఎంత వస్తుంటాయో మాత్రం ఉదహరించరు. ఇప్పుడు కొనసాగుతున్న రేట్ల ప్రకారం 66 వేల కోట్ల చిల్లర రూపాయలు తెలంగాణానుంచి (హైదారాబాద్) ,61 వేల కోట్ల రూపాయలు చిల్లర సీమాంధ్ర నుంచి ఆదాయం వస్తుంది.బహుశా కొన్నింటి లో రెవెన్యూ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంటుంది.కాని ఇవి చెప్పరు.ప్రజల పన్నులు దిగమింగతూన్నారు  అంటారు.నిజానికి అత్యంత నిజాయితీగా పన్ను కట్టేది ఉద్యోగులే..ఎందుకంటే దొంగ లెక్కలు చూపడానికి పారిశ్రామికవేత్తల్లా అవకాశం ఉండదు.నాకు తెలిసి 50 వేలు జీతం వచ్చే ఉద్యోగి ఇన్ కం,ప్రొఫెషనల్ టాక్స్ లు అన్నీ కల్పి ఏటా 25 వేల రూపాయలు కడుతుంటారు.ఆ లెక్కన రాష్ట్రం లోని ఉద్యోగులు చెల్లించే పన్నుల్ని లెక్కేసి చూడండి ఎంతవుతుందో..!కాని ఈ లెక్కని ఘనత వహించిన మన దిన పత్రికలు చూపించవు.ఎంతసేపు ప్రజల మీద ఉద్యోగుల్ని,ఉద్యోగుల మీద ప్రజల్ని ఎక్కించే కుతంత్ర రాతలే రాస్తుంటాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి