కొంతమంది కధాసంకలనాలు ఇస్తుంటారు.ఇంకొన్ని కధలు అక్కడక్కడ చదువుతుంటాను.వివిధ పేపర్లలోను...మిగతా వాటిల్లోను.చదువుతుంటాను.అసలు రచయిత అనే వ్యక్తి తమ సమాజం లో ఉండే మిగతా అన్ని వర్గాల ప్రజల కంటే ముందు ఉండాలి.సమకాలీన సమస్యల్ని ప్రతిబింబించడం వరకు ఓ.కె.,అది బాగానే ఉంటుంది.ఆ మాత్రం దిన పత్రికలు కూడా చేస్తాయి కదా.కాని అంతకు మించినదేదో రచయిత లో ఉండాలి.అలాని నాకనిపిస్తుంది.భావం,భాష,ఇతివృత్తం సెహబాష్.కాని ఇప్పుడు పోతున్న పోకడలు అన్నిటిమీద ప్రపంచీకరణ ప్రభావం ఉన్నది.మనం పళ్ళు తోముకునే దగ్గర్నుంచి నిద్రించే దాకా పల్లె నుంచి నగరం దాకా ప్రతి దానిలోను దాని ఆనవాళ్ళు ఉన్నవి.కాని దీని లోపలి భావాన్ని పట్టుకొని కనీసం మధ్య తరగతి వానికైనా అర్ధం అయ్యేట్లు ఎన్ని వచ్చాయి కధలు..వచ్చి ఉండవచ్చు..కాని ఎన్ని కదిలించి ఉంటాయి.తీసుకుంటే భూతం లా చూపించడం లేదా అసలేమీ ఉండదు...మానవ ఉద్వేగాలు చిత్రించడం సరే.అవి ఎన్నాళ్ళు నిలుస్థాయి.దాని వెనుక జరిగే కధల్ని చిత్రించే విధానం ఎక్కడుంది.
మద్యం మంచిది కాదు.పొగ త్రాగుట మంచిది కాదు.అని చెప్పి ప్రతిచోట ప్రచారం చేసే ప్రభుత్వం మరి ఎందుకని వాటిని ప్రొడ్యూస్ చేయకుండా నిషేధించదు.అంటే వాటినుంచి పన్నుల రూపం లో వచ్చే ఆదాయం కావాలి.మళ్ళీ అదే సమయం లో సినిమా హాళ్ళ లోను.పేపర్లలోను అది ఆరోగ్యానికి చేటు అని ప్రకటనలు ఇస్తుంది.అంటే ప్రజా శ్రేయస్సు వారికి అవసరమైతే నిషేధించవచ్చు గదా.ఏమిటి ఈ డబుల్ స్టాండర్డ్స్..? అప్పుడు మామూలు మనిషికి రాజ్యానికి తేడా ఉంది..? మోసమే గా అదీ..?ఇలాంటి వాటి మీద రచనలు రావాలి.చిన్నగానే ఉండవచ్చు.కాని దీని వెనుక చాలా ఉంది.ఇది ఒక ఉదాహరణ మాత్రమే.ఇలాంటివి చాల ఉన్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి