Pages

3, సెప్టెంబర్ 2015, గురువారం

"ఉపేంద్ర2" సినిమా పై రివ్యూ..!!!



సినిమా లో మంచి లోతు ఉంది.అయితే వేదాంతము,మానసిక శాస్త్రం ఇంకా వివిధ  గురువుల కొన్ని పుస్తకాలు చదివిన వారు మాత్రమే  దీన్ని అర్ధం చేసుకోగలరు.అసలు మన తెలుగు దర్శక నిర్మాతల్లో కూడా ఇలాంటి టేస్ట్ తక్కువ.యధా రాజా తధా ప్రజా మాదిరిగా మెజారిటీ ప్రేక్షకులూ అంతే.మన సినీ పెద్దలూ కూడా అంత కంటే సినిమా స్థాయి కూడా పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఎందుకంటే తమ వారసుల స్థాయి వారికి తెలుసు కాబట్టి. చాలా సింబాలిక్ గా పాత్రల పేర్లు పెట్టారు.లక్ష్మి,ఖుషీ,నువ్వు ఇట్లా.గతం లోను,భవిష్యత్ లోను బ్రతకడం కంటే వర్తమానం లో జీవించు..ఈ క్షణాన్ని   జీవించు.అనే ఫిలాసఫీ ని కొన్ని మసాళాలు దట్టించి తీశారు.

గతం లో వచ్చిన ఉపేంద్ర కి కొనసాగింపు గా ఇది సాగింది.కొత్తదనాన్ని ,ఆలోచనని ఆస్వాదించేవారు దీన్ని తప్పక ఇష్టపడతారు.అసలు ఇలాంటి థాట్ ని సినిమా తీయాలనుకోవడం ఒక సాహసం..మళ్ళీ దాన్ని జనరంజకంగా మలచడం ఇంకో కత్తి మీద నడక.ఉపేంద్ర యొక్క చదువరితనం,ఆలోచనా శక్తి ని తప్పక అభినందించవలసిందే.ఈ సినిమా ఆడినా పోయినా తర్వాత మాట.కాని ఒక డిఫరెంట్ సినిమా..!


1 కామెంట్‌: