Pages

31, అక్టోబర్ 2015, శనివారం

మధు ప్రియ ది తొందరపాటా ..ఇంకోటా..?


ఆడపిల్ల బతుకు మీద మంచి మధుర గీతాలు పాడి ఆకట్టుకున్న మధు ప్రియ మేజర్ అయిన కొన్ని రోజుల్లోనే ప్రేమ వివాహం చేసుకోవడం ఆమె సొంత వ్యవహారమే కావచ్చు. కాని మరో రెండు నెలల్లోనో ,ఏడాది లోనో ప్రేమ రంగు వెలిసి పోయినతర్వాత ఆమె బయటకి రాదనే కోరుకుందాం.అటూ ఇటు కాని వయసు లో ప్రేమ లో పడి ఆనక మళ్ళీ తల్లిదండ్రుల వద్దకి చేరుకునేవాళ్ళని ఎంతమందిని చూడడం లేదూ..!అనుభవం నేర్పే పాఠాలు చేదుగా ఉంటాయి.ఆ తర్వాత దిద్దుకోవలన్నా మన సమాజం లో చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.మనిషిని చూస్తే ఎదిగీ ఎదగనట్లుగా ఉంది శరీర స్థితి.ఇలాంటి వాళ్ళకి ఏ కౌన్సిలింగ్ ఇస్తే పని చేస్తుంది..?

ఈ అమ్మాయనే కాదు..చిన్నతనం లో పేరు తెచ్చుకున్న చాలామంది తమ కళని ఇంకా వికసించనీయకుండానే తప్పటడుగులు వేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.


అది వారి విధి అనుకోవాల్సిందే. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి