Pages

14, నవంబర్ 2015, శనివారం

"ప్రేమ లీల" సినిమా రివ్యూ..!



ప్రేం రతన్ ధన్ పాయో అనే పేరు తో హిందీ లో వచ్చిన ఈ సినిమా ని ప్రేమ లీల పేరుతో తెలుగు లోకి అనువదించారు.గతం లో సల్మాన్ ఖాన్ హీరో గా వచ్చిన ప్రేమ పావురాలు తెలుగు అనువాదం బాగా వసూలు చేసిన విషయం తెలిసినదే.ఇప్పుడు బర్జాత్య సంస్థ వారే  మళ్ళీ ఈ అనువాదాన్ని అందించారు.బర్జాత్య బేనర్ కి బాలీవుడ్ లో చాలా చరిత్ర ఉంది.సినిమా లో సల్మాన్ ఖాన్,సోనం కపూర్ ప్రధాన పాత్రధారులు.ఏ మేరకు అలరించిందో చూద్దాము.

రాచ వంశ గాధ తో ముడిపడిన చిత్రం.ఇలాంటి పట్టాభిషేకాలు గట్రా ఈ కాలం లో కూడా ఉన్నాయా ..ఏమో అనుమానమే.సరే కధా పరంగా చూస్తే  ఒక సల్మాన్ ఖాన్ అయోధ్య లో నాటక కళాకారుడు.వచ్చిన ఆదాయాన్ని ప్రీతం పూర్ యువ రాణి నడిపే ఎన్ జి వో కి దానం చేస్తూంటాడు. ఆమె ని ఇష్టపడే అతనికి ఏకంగా బాగా చేరువ అయ్యే అవకాశం వస్తుంది.మరో సల్మాన్ ఖాన్ రాచ కుటుంబ కుట్ర కి బలి అయి మంచం ఎక్కుతాడు.ఇతని సమస్యల్ని తీర్చే విధంగా  ఆర్టిస్ట్ సల్మాన్ ప్రయత్నిస్తాడు.చివరకి అతని సవతి చెల్లెళ్ళ  తో   ఉన్న గొడవల్ని,తమ్ముని తో ఉన్న వైరాన్ని రూపు మాపి సుఖాంతం చేస్తాడు.మరి చివరకి సోనం దక్కుతుందా  మొదటి సల్మానికి అనేది తెర మీద చూడాల్సిందే.

డబుల్ రోల్స్ లో సల్మాన్ ఖాన్ బాగానే నటించాడు.అనుపం ఖేర్ గుమ్మడి లాంటి పాత్రలో రాజ కుటుంబ భక్తుని గా రాణించాడు.ఉత్తరాది కోటలు అవీ బాగున్నాయి.అసభ్యత అనేది లేకుండా ప్రేమ యొక్క గొప్పదనాన్ని బాగా ఎలివేట్ చేశారు.ఈ మధ్య న వచ్చే చాలా స్ట్రైట్ చిత్రాల కన్నా  వినోదాత్మకంగా ఉన్నదని చెప్పవచ్చు.హిమేష్ రేష్మియా సంగీతం లో రెండు పాటలు బాగున్నాయి. సోనం కపూర్ బాగా చేసింది.ఒకసారి చూడదగ్గ సినిమా.

1 కామెంట్‌:

  1. మళ్ళీ జంటగా సిద్ధార్ధ్-త్రిష, లోఫర్ మూవీ పోస్టర్ రిలీజ్.., బెంగాల్ టైగర్ ప్లాటినమ్ డిస్క్ వేడుక,త్వరలో సౌఖ్యం ఆడియో రిలీజ్..more upcoming movie news

    రిప్లయితొలగించండి