ఎందుకని ఉన్నట్టుండి ఒక ఇన్సిడెంట్ జరగగానే పవన్ కళ్యాణ్ స్పందించినట్లు..ఒక మీటింగ్ పెట్టడం..దాని ద్వారా కొంత మందికి కొన్ని సందేశాలు ఇవ్వడం.మర్డర్ అనేది మామూలు విషయం కాదు, అదీ అభిమానుల మధ్య.అసలు భారత దేశం మొత్తం లో ఇట్లా సినిమా హీరో ల విషయం లో హత్యలకి తెగబడటం ఎక్కడా వినలేదు.అంత అనాగరిక దశ లో తెలుగు సమాజం ఉంది.దీని వెనుక కొన్ని రాజకీయ కారణాలు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఒక వేళ ఈ సంఘటన కి గాని పవన్ గాని స్పందించక పోతే మిగతా అభిమానుల్లో కూడా బెరుకు ఏర్పడుతుంది.భయపడి ఎవడూ ముందుకు వచ్చే సాహసం చేయడు.దాని కోసమే మానసిక స్థయిర్యం కల్పించేందుకే పవన్ మీటింగ్ పెట్టి అనేకమందిని పరోక్షంగా తిట్టడం జరిగింది.
తెలుగు ప్రజల దరిద్రం ఏమిటంటే టాప్ డైలీస్ అనబడే దినపత్రికలు.ఈ రోజున సొషల్ మీడియా నే ఈ పత్రికల కంటే మెరుగైన
పాత్ర పోషిస్తున్నయి. అసలు చంద్ర బాబు ఒకందుకు సిగ్గు పడాలి...ఒక ముక్క తెగిపొయి అందరకి అసహ్యంగా కనిపిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కి ..ముఖ్య మంత్రి అయినందుకు,కాని అది అంతా మరిచి సాధ్య మైనంత భూ కబ్జా రాజధాని పేరు మీద చేయడానికి తెగించడం అంటే తన తైనాతీ మీడియా మీద ఉన్న నమ్మకమే.
ఈ భూమి ని దాచుకో ..దోచుకో ..అనే ప్రొగ్రాం కే ..మంట పుట్టి తెలాంగాణా ప్రజలు బాబు అండ్ కో ని తరిమి కొట్టింది.కాని మళ్ళీ ఇదే పాలసీ ని సీమాంధ్ర లోను బాబు అమలు చేస్తున్నాడు. అదేమిటో గాని కోర్ట్ లు కూడా బాబు పట్ల ఉదాసీనత వహించడం చూస్తుంటే ..ఈ మేనేజ్ మేంట్ కళ లో బాబు బాగా ఆరితెరినట్లే కనిపిస్తోంది.పవన్ ఇచ్చిన కేంద్రం మీద వత్తిడి కార్యక్రమం ఎంతవరకు సఫలం అవుతుందో కాలమే చెప్పాలి.ఉద్యమాలు చేయడం అనేది తెలాంగాణా కే పరిమితం..ఆంధ్ర లో అంతా లౌక్యం,బల్ల కిందినుంచి నడిపించడం ఇవే కదా కనిపించేది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి