Pages

23, ఏప్రిల్ 2017, ఆదివారం

ఇంత హిపోక్రసీ ఏ రాష్ట్రం లో నూ ఉండదు.ఇది ఇంచుమించు అన్ని రంగాల వారి లోనూ కనబడుతుంది.

ఇప్పుడే ఇవేళ 4.40 కి జి తెలుగులో ఓ ప్రోగ్రాం పేరు అప్సర అనుకుంటా చూస్తుంటే ఇది రాయాలనిపించింది. దానిలో పేరు ఎందుకులే గాని ప్రముఖ హైదరాబాదీ మహిళా  క్రికెకటర్ కి ఏదో అవార్డ్ ఇచ్చారు.ఆ తర్వాత ఆంగ్లం లో ఏదో మాట్లాడుతుండగా ..ఓ ఏంఖర్ అందుకొని ..మీకు తెలుగు వచ్చు గదా అని అనగా..కొంచెం..కొంచెం...అని వచ్చీ రానట్లుగా చెప్పింది.ఎప్పటినుంచో రాయాలని అనుకున్నది ఇప్పుడు పెల్లుబికింది.అది ఏమిటో గాని మీరు..ఒక్క హైదరాబాద్ లోనో ..తెలుగు రాష్ట్రం లోనో నివసిస్తే ఏమీ అనిపించదేమో గాని ఇలాంటి నయా యూత్ కి ఏ భాష మీద సరైన కమాండ్ ఉండదు.

ఇంగ్లీష్ గావచ్చు..హిందీ గావచ్చు..ఉర్దూ గాని...ఏదో పైపైన మాట్లాడటానికే గాని ఏ భాషా ఒక వింద్వాన్సుని మెప్పించే స్థాయికి రాదు.అంత గాకపోయినా కాస్త అనేక పుస్తకాలు చదివి Wits తో మాట్లాడే తెలివి శూన్యం.ఒక మాదిరి తెలివి ఉన్నవారిని కూడా మెప్పించే విధంగా మాట్లాడలేరు. ఇది ముఖ్యంగా హైదరాబాదీ యూత్ లోనే బాగా కనబడుతుంది.బెంగుళూర్,చెన్నై నగరాల్లోని యూత్ అలరించే విధంగా ..భావాన్ని వివరించే విధంగా మాట్లాడగలరు.అది ఎందుకనో గాని..తెలుగు రానట్లుగా..ఇంగ్లీష్ లో మాట్లాడబోతారు..దానిలోనూ ఒక నిజాయితీ తో కూడిన కమాండ్ ఉండదు.అంతా అరకొర నే.

చివరకి అటు ఇటు చేసి ఏ భాష లోనూ భావాన్ని సరిగా వ్యక్తీకరించలేరు.ఇంత హిపోక్రసీ ఏ రాష్ట్రం లో నూ ఉండదు.ఇది ఇంచుమించు అన్ని రంగాల వారి లోనూ కనబడుతుంది.

1 కామెంట్‌:

  1. మనకి ఉభయభ్రష్టత్వం ముందు నుంచి ఉన్నదే. ప్రైవేట్ టివి చానెల్స్, టీవీ యాంకారిణుల పుణ్యామాని అందరికి ఆభాష బాగా అబ్బేసింది.

    రిప్లయితొలగించండి