Pages

28, ఏప్రిల్ 2017, శుక్రవారం

దాదా ఫాల్కె అవార్డ్ వచ్చిన సందర్భం లో అబాసు పాలు చేయ తగునా..?



సీనియర్ తెలుగు సినీ దర్శకులు కె.విశ్వనాద్ కి దాదా ఫాల్కె అవార్డ్ కేంద్రం ప్రకటించడం తో తెలుగులు చక్కగా తమ భాష వ్యక్తి గౌరవింపబడ్డాడని సంతోషిస్తారేమోనని ఆశపడడం నిరాశే అయింది.దీని లోను అనేక రంద్రాలు వెదికి ఆయన తిరోగమన భావ సినిమాలు తీశారని కొందరు ఆరోపణలకి దిగడం విడ్డూరం. అసలు సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం వినోదం..ఆ తర్వాతే ఏదైనా..!చాలా మంది లాగా బూతు డైలాగు ల తో గాని,మితిమీరిన శృంగారం తో గాని ఆయన సినిమాలు తీయలేదు.చక్కని సాహిత్యం,సంగీతం ఉన్న పాటలు పదికాలాలు పాటు పాడుకునేలా సినిమాలు తీశారు.

సప్తపది ,శంకరాభరణం  ఇంకా ఇలాంటి ఎన్నో సినిమాల్లో అంతర్లీనంగా మూఢవిశ్వాసాల్ని ఎండగట్టారు. కొండొకచో ఆయన వర్గాన్ని కాస్త గౌరవ భావం కలిగేలా పైకి ఎత్తి ఉండవచ్చుగాక..దానివల్ల ఎవరికైనా వచ్చిన నష్టం ఏమిటి..? అంత దాక ఎందుకు..రామా నాయుడు కి గతం లో ఇదే అవార్డ్ ఇచ్చారు.ఆయన తీసిన గొప్ప కళాఖండాలు ఏమిటి...ఫక్తు కమర్షియల్ సినిమాలే ఎన్ని తీసినా..అక్కినేని కూడా అంతే...తెలుగు సినిమా ఒక మూస లో పడి కొట్టుకోని పోవడానికి ముఖ్యంగా వీరే కారణం..కాదా..? కాని అప్పుడు కనిపించని అబ్జక్షన్లు ఇప్పుడు కొంతమందికి కనిపించడం వింత ధోరణి కాకా మరేమిటి..? 

1 కామెంట్‌: