అందరూ బాగా ఉంది...అంటూ ఉంటే ఈ మధ్యే చూశాను.ముఖ్యంగా గ్రాఫిక్స్ సూపర్ అని మారుమోగుతుండటం తెలిసిందే గా..! కాని ప్రచారం జరిగినంత ఇది గా అయితే నాకు అనిపించలేదు.కధ వండిన తీరు లో గాని,గ్రాఫిక్కుల వరసలో గాని అనేక కాపీలు తోచి ఇదేమి కిచిడీ సినిమా రా బాబూ అనిపించింది.ఆ శివగామి సభ లో సిం హాసనం ఇరు వైపులా నిలబడినట్లుగా ఉండే పేద్ద గోల్డెన్ శిల్పాలు ..అదే కత్తి పట్టుకొని నిలబడ్డవి..అవి ఆస్కార్ అవార్డ్ లోగోలు కావా..?కాకపోతే ఇంతెత్తు ఉన్నట్లు చూపారు.రోమన్ల ఆర్చిటెక్చర్ లో ఉన్నట్లుగా భవన సముదాయాలు,ఇంకా రాజుల కత్తులు,రధాలు అన్నే వాటిల్లోనుంచి తీసుకున్నవే..ఇది ఇండియా రాజుల కధ నా..రోమన్లదా..?ఇక ఎక్కడ చూసినా పిచ్చ బంగారం లా విగ్రహాలు,తాపడాలు..కృతకంగా ఉన్నాయి.
కోనన్ ద బార్బేరియన్ సినిమా లోనుంచి కొన్ని యుద్ధ సన్నివేశాలు లేపేశారు.కట్టప్ప బాహుబలిని నమ్మించి చంపడం కాన్సెప్ట్ ఒక సేక్స్పియర్ నాటకం లో నుంచి లేపేసినది.గ్రాఫిక్స్ అన్నీ చాలా కృత్రిమంగా ఉన్నాయి.చైనా గోడని కూడా గ్రాఫిక్స్ లో వాడేశారు.ఇక భవనాలు...యుద్ధ సన్నివేశాలు అనేక హాలివుడ్ సినిమాల్లో చూసిన వాటికి నకళ్ళే.ఇంత ధనం పెట్టి తీసినపుడు ఏదైనా చారిత్రక సినిమా తీసినా బాగుండును.దుస్తులు,భవనాలు,శిల్ప చాతుర్యాలు..ఇలాంటివి అన్నీ చూసి ..అసలు ఇది ఏ దేశపు సంస్కృతికి చెందిన సినిమా అనిపించక మానదు.
150 నుంచి 200 దాకా టికెట్లు పెంచి అన్ని కోట్లు వసూలు చేసింది అని చెప్పుకోడం అతి తెలివి.ఇదొక తొండి ఆట.ఈ రికార్డుల్లో పస లేదు.ఎవరు ఏమనుకున్నా నాకు అనిపించింది ఇదే. ఈ కాడికి హాలివుడ్ కూడా తీయలేని సినిమా అని గప్పాలు కొట్టుకోవడం హాస్యాస్పదం.అసలు సినిమా నిర్మాణం లో అంత ఖర్చు జరిగిందా అనేది కూడా ఒక సందేహమే.
మంచి పోస్ట్. చాలా బాగా వ్రాసారు...Good
రిప్లయితొలగించండిమీకు నచ్చిన latest Telugu Dubbed Movies చూసి ఆనందించండి.