మొట్టమొదటి గా నాకు ఒక సందేహం "ప్రేమమ్" అనే మాట సరైనదేనా..? మళయాళం లో ఆ పేరు ఉందని అట్లానే తెలుగు లో కూడాపెట్టేశారు.అది అటు ఉంచితే...మూడు దశల్లో మనిషి లో కలిగే భావ పరిణామాల్ని దీనిలో చిత్రించారు.బహుశా గతం లో వచ్చిన "ఆటోగ్రాఫ్" సినిమా కధ ఇన్స్పిరేషన్ అయిఉండవచ్చును.ఈ కధా సంవిధానం కేరళ వాతావరణం లో నప్పేదే.మన తెలుగు లో కొన్ని మార్పులు చేశారు.అక్కడ క్రిస్టియన్ వాతావరణం లో సాగుతుంది సినిమా అంతా...!యూట్యూబ్ లో చూస్తుంటే దానికింద చేసే కామెంట్లు అన్నీ తెలుగు రీమేక్ ని కించపరిచేవిగా ఉన్నాయి,మంచి ఫీల్ ఉన్న సినిమా ని పాడు చేశారని వాళ్ళ బాధ.పాపం వాళ్ళకేం తెలుసా..మన తెలుగు కధా దారిద్ర్యం ఇంకా ఇక్కడి పోకడలు.అనుపమా పరమేశ్వరన్,మడోన్నా సెబాస్టియన్ ని ఉంచి సాయి పల్లవి స్థానం లో శృతి హాసన్ ని తీసుకున్నారు ఇక్కడ.దాంతో ఓ మూస ఫిల్మ్ లుక్కే వచ్చింది.అప్పటికీ కొన్ని కొకేషన్ లు అక్కడివే తీసుకున్నారు.
నాగ చైతన్య నటించిన చిత్రాల్లో కొంత మెరుగైనది గా చెప్పవచ్చు.మళయాళీ హీరో ని అనుకరించాడు..అది కనబడుతూనే ఉంది.ఒక మాదిరి సినిమా ..అంతే తప్ప రికార్డ్ కలెక్షన్ లు వస్తాయంటే అది అనుమానమే.ఒకటీ అర పాటలు బాగున్నాయి.కెమెరా పనితనం ఫరవలేదు.