Pages

20, అక్టోబర్ 2013, ఆదివారం

పవన్ కళ్యాణ్ ని నట్టేటిలో ముంచడానికి కృషి చేస్తున్నాడనుకుంటా ఆ మేధో దర్శకుడు.

ఈ మధ్యన కొన్ని వార్తలు చదువుతున్నాను.రాం గోపాల్ వర్మ పార్టీ పెట్టమంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడని.ఇంత తెలివి తక్కువ వాడా..వర్మ, చిరంజీవి కే దిక్కులేక ఇంకోపంచని వెతుక్కోవలసి వచ్చింది.ఈ రోజుల్లో తెర మీద జీవితానికి ,నిజ జీవితానికి తేడా బాగా గ్రహించారు జనాలు.

గొప్ప దానకర్ణునిగా,అవినీతి చెండాడే వాడిగా తెర మీద కనిపించవచ్చుగాక,అద్భుతంగా నటించవచ్చుగాక...దానితో బయట జీవితానికి జోడించుకుని..మురిసిపోయి ఓట్లు గుద్దేశే పిచ్చి వెధవలు ఇప్పుడెవరూ లేరు.జె.పి.లాంటి వాడికే దిక్కులేక ఒకటీ అర సీట్ల తో నెట్టుకొస్తున్నాడు.

నెట్,టీవి లాంటి మాధ్యమాలు వచ్చినతరవాత వీళ్ళ రంగులు వెలిసిపోయాయి.ఆ మాత్రం తెలుసుకోలేని వెర్రివాడా గాని..పవన్ కళ్యాణ్ ని నట్టేటిలో ముంచడానికి కృషి చేస్తున్నాడనుకుంటా ఆ మేధో దర్శకుడు.Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి