ఉదయ్ మృతి చెందిన దగ్గరనుంచి వివిధ బ్లాగుల్లో..సైట్ ల లో..ఇంకా ఇతరత్రా మాధ్యమాల్లో వస్తున్న వాదనలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి.చాలామటుకు చిరంజీవి కేంప్ వైపు వేలు చూపిస్తున్నారు చాలామంది. మెగా ఫేమిలీ అతని అంత్యక్రియలకి రాకపోవడం చాలా మంది ఊహించినదే.ఎందుకంటే సుస్మిత తో వ్యవహారం..అప్పటి చేదు వ్యవహారాలు లోపల ఉండడం సహజమే కదా..!
నిజం గా మెగా ఫేమిలీయె కారణమైతే ..వారికి అంత శక్తి సామార్ధ్యాలుంటే ఎప్పుడో చిత్రసీమ లో నుండి ఉదయ్ కనుమరుగు అయి ఉండాలి.కాని జరగలేదు.మెగా ఫేమిలీ కి వ్యతిరేకంగా పనిచేసే వర్గాలు కూడా కొన్ని చిత్ర సీమలో ఉన్నాయి. అతనికి తమిళ్ లో చాన్సులు రావడం వెనుక వారి హస్తం వుండిఉండాలి.అవసరమైనప్పుడు కొన్ని పావులని తొలగించి మెగా ఫేమిలీ పాపులారిటీ ని చెడగొట్టడం..ముఖ్యంగా రాష్ట్రం విడిపోతున్న ఈ తరుణం లో ...ఒక వ్యూహమైనా ఆశ్చర్యమేమీ లేదు.
ఉదయ్ కిరణ్ దూకుడు గా వ్యవహరించే తత్వమని అతని పై వచ్చిన కధనాలు చదువుతుంటే అర్ధం అవుతున్నది.గతం లో కూడా అతను శరీరానికి గాట్లు పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.అతని సోదరుడు ఆత్మహత్య చేసు కోవడం...రీసెంట్ గా తల్లి చనిపోవడం...తండ్రి మరో అమ్మాయితో కలిసి వేరుగావడం...పుండు మీద కారం లా భార్య తో గొడవలు జరుగుతుండడం ...ఇవన్నీ వెరసీ అతని పై వత్తిడి పెంచి ఉండాలి...కొన్ని లోపల రేగే ఉద్విగ్న భావాల్ని చెప్పుకోవాడానికి ఎవరికైనా ఎవరో ఒకరు ఉండాలి.ఇక్కడే అతనికి లోటు ఏర్పడింది. అది మర్చిపోరాదు.
సినిమాలో చాన్సులు రానంతమాత్రాన ప్రపంచం అక్కడితో సమాప్తమై పోదుగదా..!రాఘవేంద్ర రావు,దాసరి నారాయణరావు లాంటివాళ్ళ కొడుకులే హీరోలుగా నిలదొక్కుకోలేమని గ్రహించి వేరే రంగాల వైపు మళ్ళారు.వారు కూడ ఇలాగే చనిపోవాలని అనుకున్నారా..?
ఒక రంగం లో నిలదొక్కుకోలేక వెనక్కి వెళ్ళి మరో రంగం లో కాలిడి పైకి వచ్చిన వాళ్ళు కోకొల్లలు.ఇలాంటి ఒక సజెషన్ ఇచ్చే తల్లి లేదా తండ్రి చెంతన లేకపోవడం అతని దురదృష్టం.ఒక వేళ చెప్పినా వినలేదేమో.
రజనీ కాంత్ కూడా తన కెరీర్ నిలదొక్కుకునే తరుణం లో ఎన్నో పాట్లు పడ్డాడు. ఒక దశలో అతడికి పిచ్చి కూడా వచ్చి మెంటల్ ఆసుపత్రిలో చేర్చబడ్డాడు.బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఎప్పుడూ పోరాటం చేసే రాటు తేలి ..అవమానాలు ..చీత్కారాలు సహించే పైకి వచ్చారు.అది మరువకూడదు..!Click here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి