Pages

18, జనవరి 2014, శనివారం

ఈ మంత్రి గారి కి ఒక న్యాయం...మిగతా వాళ్ళకి ఒక న్యాయమా..?



శశిథరూర్ ఇండియాకి రాకముందు అతనికి కొంత గౌరవం ఉండేది.ఐక్యరాజ్యసమితి లో ఏదో పదవి సంపాయించి..హాయిగా హిందూ లో వ్యాసాలు రాస్తుండేవాడు.పెద్ద మేధావి లా అనుకునేవారంత.అతగాడి ఖర్మ గాలి..రాజకీయ దురద పుట్టి ఇండియాకి ఏతెంచి హుటాహుటిన కేంద్రమంత్రి ఐపోవడం జరిగింది.

ఇక అతగాడి ప్రవర్తనా శైలి కి సంబందించి ఎన్ని వివాదాలు తలెత్తాయో అంతులేదు.పేదవాళ్ళ పైన అడ్డమైన కామెంట్లు మంత్రి గా ఉంటూనే చేయడంతో ముక్కదొబ్బులు దొబ్బారు..అంతా పేపర్లలో!

ఈయన ముచ్చటగా మూడోపెళ్ళి చేసుకున్నారు.సునంద పుష్కర్ ని.ఆమె కీ మూడో పెళ్ళినే.సరే అనధికార ఖాతాలో ఏమేమి ఇరువురికి ఏడిచాయో మనకనవసరం.నిన్నంటే నిన్న శశిథరూర్ మీద ఆరోపణలు చేసిందో లేదో ..వెంటనే హోటల్ లో శవమై తేలింది. మనోడు ఎంతైనా అంతర్జాతీయ లెవ్వెల్ కదా..!

ఈ విధంగా ఏ మామూలు మగాడైనా ఇండియాలో చేస్తే ఈ పాటికి వాడిని గల్లాపట్టి స్త్రీశక్తి సంఘాలు నడిరోడ్డు మీదికి తెచ్చేవి.పోలీసులు వాడి తల్లితండ్రులని,అక్కచెల్లెల్లని నానా టార్చర్ పెట్టేవారు.వాడికి ఎంతపరువు పోవాలో అంతాచేసేవారు.మరి ఇదంతా తూచ తప్పక థరూర్ విషయం లో జరుగుతుందా..నో.నో..చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమా ఎంతమాట..హోదాల్ని బట్టి న్యాయాలు..!!!    Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి