Pages

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

ట్రాఫిక్ సినిమా పై నా రివ్యూ...!



ఎలాంటి అట్టహాసం లేకుండా రిలీజయిన ట్రాఫిక్ సినిమా చూశాను.చెన్నయిల్ ఒరు నాళ్ అనే పేరుతో దీన్ని తమిళం లో తీశారు.తెలుగు లో  డబ్బింగ్ వెర్షన్ అన్నమాట.గమనించగలిగితే మంచి వైవిధ్యభరితమైన కధలు మన జీవితం పక్కనే..మనుషుల మధ్యలోనుంచే ఎలా తీసుకోవచ్చో ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది.సందేశం ఇస్తూనే రోజువారీ జీవితం కి దగ్గరకి ఉండేలా కధని మలచడం గొప్ప విషయం.సినిమా కధని చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది.సినిమా మొదలైన పావుగంట వరకూ ఏమిటీ సినిమా అనిపిస్తుంది.  ఆ తరవాత నుంచి మంచి వేగం అందుకుంటుంది.ఒక మానవీయ సహాయం చేసేదానికి మనుషులంతా ఒకరికొకరు సహకరించుకుంటే ఎంత అసాధ్యమైనదాన్ని కూడ ఎలా చేయవచ్చునో ఈ సినిమా నిరూపిస్తుంది.ప్రకాష్ రాజ్,రాధిక,శరత్ కుమార్,సూర్య ,ప్రసన్న ఇంకా ఇతరులు పాత్రోచితంగా జీవించారు.ఒక వెరైటీ కోసమైనా చూడవచ్చు.నిజంచెప్పాలంటే దీనిలో పాటలు లేకపోయినా ఫరవాలేదు.తొడగొట్టుకుంటూ,వంశాల పేర్లు చెప్పుకుంటూ మీసాలు మెలేసుకుంటూ ఇంకా ఎంతకాలం మన తెలుగు హీరోలు వందల వత్సరాలు జనాన్ని వెనక్కి తీసుకెళ్తారు.సమకాలీన జీవితాలకి దగ్గరగా ఎలా సినిమాలు తీయవచ్చునో తెలుసుకోవాలంటే ఇలాంటి చిత్రాలు చూడాలి.  Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి