రాష్ట్రవిభజన లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి నచ్చక పురంధరేశ్వరి బి.జె.పి లో చేరారట.సరే విభజన విషయం లో బి.జె.పి. ఏమీ మెతక వైఖరి చూపించలేదే..నిజానికి ఆ పార్టీ సహకారం వల్లే తెలంగాణా అవతరించింది.కాదంటే చచ్చినట్టు కేంద్రప్రభుత్వం మిన్నకుండేది. ముసుగు తీసి చెప్పాలంటే కాంగ్రెస్ కి కోస్తా లో గడ్డు కాలం కాబట్టి సేఫ్టీ జోన్ లోకి దూకారంతే.కేవలం ఆర్.ఎస్.ఎస్. నుంచి వచ్చిన నాయకులని మాత్రమే బి.జె.పి.తన స్వంత మనుషులుగా చూస్తుంది,మిగతావాళ్ళని వ్యుహపరంగా కలుపుకుంటారంతే..పెద్దగా ప్రాధాన్యతనివ్వరు అనేది అందరికి తెలిసినదే.అది ఎంత అమాయకుడైనా అర్ధం చేసుకోగలడు.ఆమె ఒక్కరనే కాదు ఇప్పుడు రాష్ట్రంలో సాగుతున్న కప్పదాట్లు చూస్తుంటే సగటుఓటరుకి వారి వైఖరికి వెగటు పుడుతుంది.వారి వ్యాపారాలకోసం,స్వప్రయోజనాల కోసం చెప్పే కల్లబొల్లి కబుర్లు వింటుంటే నియంతృత్వమే ఈ దేశానికి ..అభివృద్ది చెందాలంటే సరైన మార్గమేమోననిపిస్తుంది.
ప్రజస్వామ్యం అనే భావనని గాని,దాని ఆత్మని గాని భారతీయులు ఇప్పటికీ పట్టుకోలేకపోయారు.దాని ముసుగులో సాగుతున్నది కేవలం కుటుంబాల పాలన,కులాల పాలన మాత్రమే.విచిత్రంగా ఇక్కడి సామాన్య ఓటరు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇంతకు మించి ఏముంది అనుకుంటాడు.అంతకు మించిన జ్ఞానాన్ని కూడా మన దిన పత్రికలు గాని,మరే పత్రికలు గాని ఇవ్వవు.ఎందుకంటే దానిలో ..అలా కొన్సాగడం లోనే వారి ప్రయోజనాలు బాగుంటాయి.
పాశ్చ్యాత్య దేశాల్లోని ప్రజస్వామ్యం వారి చరిత్ర నేపధ్యం లోనుంచి ,వందల వేల ఏళ్ళ అనుభవాల సారం నుంచి సహజంగా పెల్లుబికినట్టిది.అకాడ ఏ దేశం లోనూ ప్రజస్వామ్యం పేరు మీద మతం ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టరు. చట్టాలను సాధ్యమైనంత దాకా పౌరులు అనుసరించడం లోనే దేశ పౌరులందరి క్షేమం ఉంటుందనే స్పృహ ఉంటుంది. నాయకులు అడ్డంగా అస్తులు పెద్ద ఎత్తున సంపాదించుకోవడం కుదరదు.ప్రజలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటుంది గనకనే ..అవసరమైతే పెడ పోకడలు తలెత్తినపుడు పౌరులు ప్రాణాలకి తెగించి తుపాకులు పట్టుకుని బయటకి వస్తారు.అక్కడ బయటి శాంతి వెనుక ..అవసరమైతే తిరుగుబాటు చేస్తారేమో ననే భయం కూడా ఉంటుంది. మనదగ్గర మాత్రం నిర్లిప్తత ,ఆ రోజుకి చూసుకునే తత్వం ఉంటుంది.
కనుక ప్రజాస్వామ్యం అనే పేరుతో ఎన్ని వేషాలయినా వేయవచ్చు.ఎన్ని కబుర్లయినా చెప్పవచ్చు.వాటిని పొల్లు పోకుండా అచ్చొత్తి ప్రజలదగ్గరకి తీసుకెళ్ళే ప్రజాస్వామిక పత్రికలు ఎలానూ ఉంటాయి.Click here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి