Pages

15, ఏప్రిల్ 2014, మంగళవారం

అదే సినిమా లో హీరో కి పిరుదులు చాలా అసాధారణమైన లావుతో ఉంటాయి

మనుషుల రూపాన్ని అవహేళన చేస్తూ సినిమాల్లో డైలాగులు పెట్టడం ఎంతవరకు సమంజసం..?పొట్టి వాడని,కుంటి వాడు అని ఇలా అవహేళన చేస్తూ కించపరుచుతూ పాత్రలచేత మాట్లాడించడం నీచాతినీచం.ఉదాహరణకి ఇటీవల రిలీజైన ఓ సినిమా లో ఒక హాస్య నటుడిని ఉద్దేశించి ఓ అమ్మాయి "మీటర్ అంత లేడు వీడు గురువేంటి " అంటుంది.అంటే పొట్టి వాళ్ళు ఎందుకూ పనికి రాని వారనా వీరి అర్ధం.లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర్నుంచి ఇంకా ఎంతో మందిని మనం అనేక రంగాల్లో విజయవంతమైన వాళ్ళని పొట్టిగా ఉండే వాళ్ళలో చూడవచ్చు.కాని దాని కించపరచడానికి వాడుకోవడం ఆ హీరో ,దర్శకుల నీచమైన టేస్ట్ ని తెలియజేస్తుంది.ప్రతి మనిషి తన ప్రమేయం లేకుండా ఎన్నో అవక్రతలతో పుట్టవచ్చు.కాని దాన్ని విమర్షిస్తూ డైలాగులు పెట్టడం కురచదనం.

అదే సినిమా లో హీరో కి పిరుదులు చాలా అసాధారణమైన లావుతో ఉంటాయి.మరి హీరో పిరుదులని ఉద్దేశించి అంత పిర్రలున్నవాడు వాడేం హీరో అని ఒక స్త్రీ పాత్ర అంటే అత నెలా ఫీలవుతాడు.లెక్కప్రకారమైతే జోక్ గానే తీసుకోవాలి.ఎత్తు మీద,బట్టతల మీద,స్థూల కాయం మీద జోకులు  వేసి అవమానపరచడాన్ని ఖండించాలి.  Click here

1 కామెంట్‌:

  1. @ఎత్తు మీద,బట్టతల మీద,స్థూల కాయం మీద జోకులు వేసి అవమానపరచడాన్ని ఖండించాలి.@

    రంగు మీద కూడా.

    రిప్లయితొలగించండి