Pages

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

నిజం చెప్పాలంటే నందమూరి వంశం లో ఏ ఒక్కరికి సరైన రాజకీయ పరిణితి లేదు.



ఈ సారి ఎలక్షన్ ప్రచారం లో ఎక్కడా జూ. ఎన్ టి ఆర్ కనిపించడం లేదు.కనిపించకుండా చేశారు అంటే బాగుంటుందేమో..!సినిమా ల పరంగా కూడా  వెనుకబడి పోయాడు. నారా రోహిత్ ని  అతనికి బదులుగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది.కొన్ని రోజులు పోతే బాలయ్య కొడుకు సినిమా పొజిషన్ కి వచ్చేస్తాడు.ఆ రకంగా చూసినా జూ.ఎన్ టి ఆర్ కి రాబోయే రోజులు గడ్డు కాలమే.నందమూరి వంశ నట వారసునిగా జూనియర్ ని ప్రోత్సహించడం అంత శ్రేయస్కరం కాదు వీరికి. అది వారి కొంపముంచుతుంది.ఇప్పుడు వచ్చిన గ్లామర్ తోనే ..తండ్రి హరికృష్ణ తో కలిసి బాబు కి ,అతని కొడుకుకి చెక్ పెట్టాలని ప్రయత్నించి వల్లకాక మిన్నకున్నాడు.

టక్కు టమార విద్యల్లో సాటిలేని బాబుని ఎదుర్కొనే సాహసం జూనియర్  చేయడం పొరబాటు స్టెప్ గానే చెప్పాలి.కొంతకాలం రాజకీయాల జోలికి పోకుండా ఉండి ఉంటే బాబు కి కంటు కాకుండా ఉండేవాడు.పార్టీ నాయకత్వం నందమూరి వారసులకే చెందాలని వాదించవచ్చుగాక.కాని కేడర్ ని మొత్తం తనవైపు తిప్పుకొనే తెలివితేటలు చాకచక్యం జూనియర్ కి ఎక్కడ ఉన్నాయి...? ఆవేశపూరితం గా ప్రసంగాలు చేసినంత మాత్రాన రాజకీయాల్లో రాణించడం జరగదు.కేవలం అది ఒక పనికొచ్చే అంశమే తప్ప అదే సరస్వం కాదు.ఆ మాట కొస్తే సీనియర్ ఎన్ టి ఆర్ మంచి వక్త,అందగాడు కూడా...కాని అవి ఏమీ చంద్ర బాబు ఎత్తుగడలముందు పనిచేయలేదు.

అసలు నిజం చెప్పాలంటే గొప్పగా రాజకీయాల్లో రాణించిన వాళ్ళు అంతా ముందుగా వాళ్ళు వ్యూహపరులు.. ఆ తర్వాతనే ఉపన్యాసకులు.ఆవేశాన్ని ప్రదర్శించడం కూడా వారి ఎత్తుగడల్లో ఒక భాగమే తప్ప గుడ్డి గా ఆవేశం లో పడి కొట్టుకుపోరు.అలాంటివి సినిమాలో చూడడానికి పనికొస్తాయి తప్ప వాస్తవ జీవితం లో పనికి రావు.నిజం చెప్పాలంటే నందమూరి వంశం లో ఏ ఒక్కరికి సరైన రాజకీయ పరిణితి లేదు.ఏదో ఆ వంశం (ఏంటో ఈ వంశాల గోల..) పేరు చెప్పి నాటకీయతల్ని చూపించడం తప్ప ఎవరొచ్చి ప్రచారం చేసినా ఓటర్ ఎవరికి వెయ్యాలనుకుంటే వాడికే ఓటు వేస్తాడు ఈరోజున...మార్పు ఆ లెవెల్లో ఉందిప్పుడు.Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి