Pages

1, ఫిబ్రవరి 2015, ఆదివారం

"బీరువా" సినిమా పై నా రివ్యూ..!



సినిమా టైటిల్ చూసి ఇదేదో హాస్యభరితమైన సినిమా అని వెళ్ళాను.తీరా చూస్తే ప్రేమ కధ.కొత్త సీసా లో పాత సారా.భయంకరమైన ఒక విలన్ ..అతని కో కూతురు..ఇవతలేమో నరేష్ కి కొడుకు గా హైపర్ యాక్టివ్ సందీప్ కిషన్.బీరువా ల్లో తప్పించుకుంటూ ప్రేమ కధ కొనసాగడం అనే కాన్సెప్ట్ ఎవరిదో గాని వారి తలకాయకి వెయ్యి కొబ్బరి కాయలు కొట్టాల్సిందే.అంత వీజీయా ఒక మనిషి  బీరువాల్లో దాక్కుని విచ్చల విడిగా వెళ్ళడం..సిల్లీగా ఉంది.తండ్రీ కొడుకులుగా ఏమిటో ఆ సీన్లు.పరమ బోరింగ్.ఉచ్చిలి తనం..పోరంబోకు వేషాలతో ఈ కాలపు అమ్మాయిల్ని పడేసుకోవడం అంత ఈజీయా..!అసలు ఇలాంటి సినిమాలు వస్తే ఏంటి..రాకపోతే ఏంటి..అనిపిస్తుంది కొన్ని సీన్లు చూస్తే.బడ్జెట్ లోనే చుట్టేసారు సినిమాని.పాటలు,సంగీతం అంతంత మాత్రం.హీరోయిన్ ని బాగానే వాడుకున్నారు అందాల ఆరబోతకి.  

1 కామెంట్‌: