ఈ రోజు ఎర్రబల్లి దయాకర్ రావు చేసిన ఓ కామెంట్ చూస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.ఆయన గారు కె సి ఆర్ ని విమర్శిస్తూ నీ కొడుక్కి ఎన్ టి ఆర్ పేరెందుకు పెట్టుకున్నావు.. తీసెయ్ అనడం బుర్రతక్కువ తనాన్ని సూచిస్తుంది.ఆ పేరుకి ఏమన్నా పేటెంట్ హక్కులు ఉన్నాయా..?ప్రపంచం లో ఎవరి పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు..!ఆపడానికేమీ అంతర్జాతీయ చట్టాలు ఏమీ లేవు.ఈ లెక్కన చంద్రబోస్ అనే పేరు పెట్టుకున్నవ్యక్తి దొంగ అవుతే అతని పేరు ని గవర్నమెంట్ తొలగించాలా లేదా తానే తొలగించుకోవాలా..?గాంధీ పేరు పెట్టుకొని తెల్లారితే మందు లేనిదే జీవించలేని ప్రాణులున్నారు..ఈ లెక్కన వాళ్ళ పేర్లు అన్నీ కూడా
తొలగించుకోవలసిందే గదా..? కనక ఇలాంటి హాస్యపూరిత విమర్శలు చేయడం వల్ల్ల ఉన్న పరువు కూడా పోతుంది అని గ్రహించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి