Pages

14, ఫిబ్రవరి 2015, శనివారం

కెసీఅర్ మరో నియంత లా మారుతున్నారా..?


ఈ మధ్య అధికారం చేపట్టిన తర్వాత కెసియార్ నియంతృత్వ పోకడలు శృతి మించుతున్నాయా అనిపించుతున్నాయి.ఉన్నట్టుండి ఎలాంటి షోకాజ్ లేకుండా రాజయ్య ని మంత్రిపదవి నుంచి తొలగించడం ,వాస్తు బాగా లేదని సెక్రెటేరియేట్ మారుస్తానని ప్రకటించడం ,తెలంగాణా వచ్చిన సందర్భం లో వివిధ గుళ్ళకి మొక్కులు చెల్లిస్తాననడం ఇదిగో ఇప్పుడిప్పుడే ఆయన లోని ఇంకో మనిషి నిద్ర లేస్తున్నట్టుగా ఉంది.తను వ్యక్తిగతంగా మొక్కుకుంటే దేవుళ్ళకి చెల్లించవచ్చు కోట్లాది మొక్కులు..దానికి ఎవరకి ఎలాంటి అభ్యంతరం ఉండనక్ఖరలేదు.

కాని ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం ఇది.ఏ మతాన్ని అధికారికంగా గుర్తించలేదు మన రాజ్యాంగం అది గుర్తుంచుకోవాలి.ఆయన గాని ఆ కోట్లాది రూపాయాల మొక్కులు చెల్లిస్థే ఏ పద్దు లోనుంచి ఆ మొత్తాన్ని చెల్లించారో ప్రజలకి తెలియజేయాలి.అంతే తప్ప ప్రభుత్వ ఖజానా తమ స్వంతం అనుకోరాదు.అలాగే సెక్రెటేరియేట్ వాస్తు ...ఇన్నాళ్ళ బట్టి హాయిగా సాగుతున్న పనులు ఈ వాస్తు దోషం తో మరి ఇప్పుడు ఎక్కడెక్కడ గండి కొడుతున్నాయో సోదాహరణంగా కెసీఅర్ వివరించాలి.ప్రజలు ఒక చరిత్రాత్కమైన తరుణం లో ఆయనకి అధికారమిచ్చింది ఒక సదుద్దేశ్యం తో తప్ప వాస్తు,మొక్కులు లాని ఊబి లోకి తీసుకెళ్ళడానికి కాదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి