Pages

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

"టెంపర్" సినిమా పై నా రివ్యూ...!



అసలు సినిమా టైటిల్ లోనే ఒక వంకర టింకర ఉంది.సినిమా కధ కి ఆ టైటిల్ ఎలా అతికిందో ఆ దేవుడికే తెలియాలి.పూరి జగన్నాధ్ లో క్రియేటివిటీ అడుగంటింది అనడానికి ఈ సినిమా పెద్ద ఉదాహరణ.సినిమా మొదలయిన దగ్గరనుంచి ఒకటే పెద్ద పెద్ద గా అరుపులు,కేకలు ..అవి దుమ్ము లేపే డైలాగులనుకుని మనం తప్పట్లు కొట్టాలి కామోసు.చాలా చీప్ గా ఉంది.కధ కొస్తే పోలీస్ ల అవినీతి ..ముఖ్యంగా హీరో యే ఓ అవినీతి పోలీస్ అధికారి ...విలన్ లకి సపోర్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు.ఉన్నట్టుండి తన నెచ్చెలి ద్వారా జ్ఞానోదయం అయి మంచి గా మారిపోయి ఆ పిమ్మట తన మీద కూడా నేరం మోపేసుకొని యమా కళ్ళు తెరిపిస్తాడు సమాజానికి.సినిమా లో అలా పెద్ద ఎత్తున అరవడమే నటన అనుకునే జనాలు ఉన్నంత వరకు ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి.హీరో అరుపులు చాలవన్నట్టు పోసాని పాత్ర పోలీస్ ..పోలీస్ అంటూ చివర్లోనూ పెడబొబ్బలు పెట్టడం..!ఇక తెలుగు సినిమా  ఇంతకి మించి ఎదగదా..? 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి