Pages

10, మార్చి 2015, మంగళవారం

సుగాలి లేదా లంబాడ కులాన్ని ఎస్.టి. జాబితా లో నుంచి తొలగించవలసిన అవసరం గురించి


ఖైతి లంబాడ,వాల్మికి లాంటి కులాలను ఎస్.టి.జాబితా లో చేర్చేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమీషం ని నియమించినట్లు పేపర్లలో చదివాము.దానితో బాటుగా ఇంకొక ముఖ్య విషయాన్ని కూడా పునరాలోచించవలసిన తరుణం వచ్చింది.అదేమిటంటే సుగాలి లేదా లంబాడ కులాన్ని ఎస్.టి. జాబితా లో నుంచి తొలగించవలసిన అవసరం గురించి.S.T.వర్గం పేరుతో వచ్చే ప్రతి ప్రయోజనాన్ని సిమ్హ భాగం పొందుతున్నది వీరే.నిజానికి వీరి యొక్క తీరు గమనించినట్లయితే అసలు వీరిని ఏ విధంగా ఎస్.టి.జాబితా లో చేర్చారు అనే అనుమానం రాక మానదు.ఎందుకంటే ధన సంపాదన లోను,రాజకీయ ప్రయోజనాలు పొందడం లోను సామ,దాన,భేద దండోపాయాల్ని పుష్కలంగా ప్రయోగించే ఘనులు వీరు.నూటికి తొంభై శాతం ఉద్యోగాల్ని,పదవుల్ని ఎస్.టి. రిజర్వేషన్ తో పొందుతూ మిగతా నోరు లేని ,ఎత్తలని గిరిజన వర్గాల అభివృద్దిని దెబ్బ తీస్తున్నారు.వీరి భాషని ,ఆచారాల్ని పరిశీలించినట్లయితే రాజస్థాని,మరాఠి,హింది పదాలు కలిసివుంటాయి.వ్యవహార దక్షతలో ఏ అగ్ర కులానికి వీరు తీసిపోరు.గమనించిన వారికి అది తెలిసిపోతూనే ఉంటుంది.గొప్ప లాబీయింగ్ చేయడం లోకూడా వీరు సిద్ధహస్తులు.ఇక వీరి ముందు మిగతా గోండ్,కోయ,చెంచు వంటి జాతులు ఎలా పైకి వస్తాయి.వారి దగ్గర అన్నం గుంజుకుని తింటున్నప్పుడు.కనుక రాజకీయ పదవులు పందేరం లో గాని,సీట్లు ఇచ్చే విషయం లో గాని ,ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించేటప్పుడు గాని సాధ్యమైనంత వారకు వీరిని మినహాయించినపుడే మిగతా గిరిజన జాతులు అభివృద్ది పొందుతాయి. 

1 కామెంట్‌:

  1. కులప్రాతిపదికను రిజర్వేషన్లను కల్పించటం అనే ప్రాతిపదికలోనే దోషం‌ ఉంది. ఈ మాట అన్నందుకు గాను కొందరికి కోపం రావచ్చును. అర్థికస్థితిగతుల ఆధారంగా వ్యక్తులకు విద్యాఉద్యోగాలలో రిజర్వేషన్ అనేది ఏర్పరచి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావు. కులప్రాతిపదిక అనేది ఒక రాజకీయాస్త్రం ఐపోయింది. ఇప్పుడు మతప్రాతిపదిక కూడా తెరమీద కదలాడుతోంది. ఇవన్నీ భారతదెశానికి సుదూరభవిష్యంలో ఇబ్బందులను కాక ముప్పునే తేగలవని ఆలోచనాపరులు గ్రహిస్తారు. రాజకీయులకు తక్షణావసరాలు తప్ప దేశభవిష్యం పట్టదు కాబట్టి వారి ధోరణులు భిన్నంగా మరింతగా లబ్ధిని చేకూర్చగల రిజర్వేషన్ పోలసీలవైపే మొగ్గుతూ ఉంటాయి.

    రిప్లయితొలగించండి