Pages

13, మార్చి 2015, శుక్రవారం

"సూర్య వెర్సస్ సూర్య" సినిమా రివ్యూ....!



నిఖిల్ నటించిన సినిమాలు కొద్దిగా బాగుంటాయనే ఉద్దేశ్యం తో వెళ్ళాను.ఎందుకంటే కార్తికేయ లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించాడు కాబట్టి.అదే వరసలో ఏమైనా వెరైటీ సినిమా నేమో అని చెప్పి వెళ్ళా.మొదటి దగ్గర్నుంచి అంతా డిఫరెన్స్ గానే ఉంది.సూర్యుడు  వేడి తగిలితే డేంజర్ ఈ సూర్య అనబడే హీరోకి.దానికోసం నైట్ కాలేజీలో చేరడం..అక్కడ ముదురు వయసు ఫ్రెండ్స్ తో అదోరకం ఫ్రెండ్షిప్.ఆ తరువాత యాంకర్ హీరోయిన్ ని ప్రేమించడం కోసం వేసే చిత్ర వేషాలు.థీం కొత్తగా ఉన్నా తీసే విధానంలో ..కధనం లో ఏదో లోపించింది.అందుకే బిగి ఉండదు కధలో.కొన్ని సార్లు బోరుగా అనిపించి నిద్ర కూడా బట్టింది.రెండు పాటలు కేచీగా ఉన్నాయి. పెద్దగా చెప్పడానికి ఏం లేదు.అయితే ఒకటి ఈ సినిమా ని మనసు పెట్టి తీసినట్లయితే ఇంకా బాగా ఉండేది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి