కొన్ని సినిమాలకి పెద్దగా పేరు రాదు గాని మంచి వెరైటీ గా ఉంటాయి.ప్రస్తుతం అనేకుడు అనే పేరు తో తెలుగు లో డబ్బింగ్ అయిన ఈ సినిమా రమారమి నెల క్రితం అనేగన్ పేరుతో తమిళ మాతృక లో రిలీజయింది.అక్కడ ఏమో గాని మన తెలుగు లో మటుకు కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ లా అనిపించింది.ఎంతో కొంత స్టడీ చేసి ఏదో కొత్తదనం చూపెట్టాలని అక్కడి దర్శకులు అనుకుంటారు.దానికి తోడు నిర్మాతల ,హీరోల అడ్డం కూడా ఉండదనుకుంటా..లేకపోతే ఇలాంటివి రావు.
కధ సమకాలీనత కి బాగా సంబందించినది.సాఫ్ట్ వేర్ రంగం లో ..దాని రంగుల ప్రపంచం కింద ఉండే అమానవీయ కోణం ని బాగా ఎలివేట్ చేశారు.భావ పరమైన స్వైరకల్పనకి గాను సాఫ్ట్వేర్ ఉద్యోగుల మానసిక ప్రపంచం లతో ఆ వ్యాపార వర్గాలు ఎలా ఆడుకుంటాయో బాగా చూపించాడు.
రిగ్రెషన్ అనే దాని మాటున పూర్వ జన్మల తో కూడిన కధతో అలరించారు.బర్మా యువకుని గా అక్కడి ప్రేమ కధ,ఇంకో రెండు కధలు ముడివేసి మళ్ళీ ప్రస్తుతానికి తీసుకొచ్చి ధనుష్ చేత ఫీట్ చేయించారు.హృదయాన్ని తట్టే మెలికలు,సన్నివేశాలు కొన్ని చోట్ల సహజంగా అమరాయి.ధనుష్,అమైర దస్తూర్ హీరో హీరోయిన్ లుగా మంచిగా చేశారు.హేరిస్ జయరాజ్ సంగీతం ఫరవాలేదు.ఫోటోగ్రఫీ బాగుంది. ఒక్కసారి చూస్తే వచ్చిన నష్టం ఏమీ లేదు..కొంచెం రసానుభూతి పొందటం తప్ప..!!!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి