Pages

19, మే 2016, గురువారం

వోడ్కా విత్ వర్మ పుస్తకం ని చదివిన తర్వాత....


ఇది రాయాలనిపించింది.రెండు రోజుల క్రితం చదివాను.సిరాశ్రీ రాసిన  మరియు సేకరించిన ఇంటర్యూలు అన్నీ కలిపి ఈ పుస్తకం తయారైంది.ఒక ప్రవక్త స్థాయి లో రాం ని ఫోకస్ చేయాలనుకున్నా  ఎందుకనో తేలిపోయింది.మొత్తం మీద ఒక డ్రంకార్డ్ గా కొన్ని హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ గా రీడర్ కి అవగాహన ఏర్పడుతుంది. రాము మేనమామ ఒకతను మాత్రం బాగా ఉన్నదున్నట్లు చెప్పాడు.బటర్ బ్యాచ్ ని పక్కన పెట్టుకొని నానా చెత్త సినిమాలు సినిమాలు తీస్తున్నాడని ఆ వ్యవహారాలు కట్టిపెడితే మళ్ళీ మంచి సినిమాలు తీయగలడని చెప్పాడు.అది మాత్రం కరెక్టే.ప్రతి ఒక్కళ్ళ మీద ఫైర్ బ్రాండ్ కామెంట్లు చేసే వర్మ ఆ విషయాల్లో సెలెక్టివ్ గా ఉంటాడని సిరాశ్రీ యే ఒక చోట చెప్పాడు.ఎవరైతే సాఫ్ట్ టార్గెట్ లుగా ఉంటారో వాళ్ళ మీద మాత్రమే ట్వీట్ తుంటాడు తప్పా ఏ బాలకృష్ణ నో, ఇంకా ఏ చంద్ర బాబు నో ఎందుకని కామెంట్ చేయలేడు అని మనకీ ఈ పుస్తకం చదివిన తర్వాత అనుమానం వస్తుంది.అతను మొదటి నుంచి ఇదే తరహా వ్యక్తి అయితే అసలు ఈ మాత్రం అయినా పైకి వచ్చేవాడు కానే కాదు.చాలా తెలివి గా తన ఫైల్యూర్స్ ని కప్పి పెట్టుకుంటూ అక్కడక్కడ కొన్ని కొటేషన్ లని చెప్పుకుంటూ బండి లాగిస్తున్నాడు.సరైన హిట్ సినిమా తీసి అసలు చాలా ఏళ్ళయింది.నీషే,అయాన్ రాండ్ అంటూ చెప్పే కబుర్లు ఏ ఇంగ్లీష్ పుస్తకాల్ని పెద్దగా చదవని వాళ్ళకి అద్భుతం అనిపించవచ్చునేమో కాని ఆయా దేశాల్లో వాళ్ళ ఫిలాసఫీలు చాలా అవుట్ డేటెడ్ ..ఆ పిమ్మట ఎన్నో ట్రెండ్స్ వచ్చాయి...ఏది లేని చోట వెంపలి చెట్టే మహా వృక్షం మరి.

25, ఏప్రిల్ 2016, సోమవారం

నిజమైన ప్రతిభా విశేషం ఈరోజు కాకపోతె వందల ఏళ్ళకైనా బయటబడితీరుతుంది

నిజమైన ప్రతిభా విశేషం ఈరోజు కాకపోతె వందల ఏళ్ళకైనా బయటబడితీరుతుంది...ఆ ఉదంతమే ఇది . స్వర్ణ కమలం సినిమా ..అదే ..విశ్వనాధ్ గారు తీసింది చూసే ఉంటారు.దాంట్లో ఒక పాట..కొలువై ఉన్నాడే దేవదేవుడు..అనే పాట ఒకటున్నది.భాను ప్రియ కూడా అద్భుతమైన నాట్యం చేస్తుంది దానికి.ఆ సినిమా లో ఆ పాట విన్నాక అబ్బా సీతారామ శాస్త్రి భలె రాసేడే అని ఆనందమనిపించింది.నిజానికి సీతారామ శాస్త్రి నా దృష్టి లో పెద్ద హృదయాన్ని ఊపేయగల కవి ఏమీ కాదు.భాష ని,భావాన్ని,ఇతర చమక్కుల్ని కొత్త అంచులకి తీసుకెళ్ళగలిగిన సత్తా అతని లో శూన్యం.అతని పాట ఏదీ లోపలకి వెళ్ళి తగలదు...ట్యూన్ కి తగిన పదాల్ని అలా పేర్చినట్లు ఉంటాయి పదాలు.ఒక వేళ పల్లవి లో లైన్లు బాగున్నా చరణాలు అర్ధం పర్ధం లేకుండా పేర్చినట్లు ఉంటాయి. ఈ విష్యం లో నా ఆల్ టైం ఫేవరైట్ వేటూరి గారే.ఆ చమక్కు..అది క్లాస్ పాటైనా ..బూతు పాటైనా..ఆ యిదే వేరు. ఆ ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా...ఆ స్వర్ణ కమలం లోని ఆ పాట " కొలువై ఉన్నాడే " అనేది 17 వ శతాబ్దం లో తంజావుర్ ని పాలించిన మరాఠా పాలకుడు షహజీ మహరాజ్ రాసిన శంకర పల్లకి సేవ అనే ప్రబంధము లోనిదని తెలిసింది.దానిలోని పదాల పోహళింపు ..ఆ గమ్మత్తే వేరు..ఈ సారి మళ్ళీ విని చూడండి.ఆ మహానుభావుడి కైతకి ఇన్ని నాళ్ళకి ఇలా పేరు రావలసి ఉందేమో.

21, ఏప్రిల్ 2016, గురువారం

బాలకృస్ణ సంస్కార రాహిత్యం



పేపర్ల లో వచ్చిన ఫోటొలు,డైలాగులు ముఖ్యంగా సినీ నటుడు బాలకృస్ణవి చూసినపుడు అసలు ఏ విలువలు కేసి వీళ్ళంతా దేశాన్ని తీసుకుపోతున్నారు అని అనుమానం రాక మానదు.మనం జీవిస్తున్నది ప్రజాస్వామ్య దేశం లో.ప్రజా జీవితం తో ముడిపడి ఉన్న ప్రతి దాన్ని ఇక్కడ ప్రశ్నించే హక్కు పౌరులకి ఉంది.ఆ నటుడు ఒక్క సినీ నటుడిగా ఉంటే ఫర్వాలేదు,ఒక శాసన సబ్యుడు కూడా.అలాంటప్పుడు ఎంత బాద్యత గా వ్యవహరించాలి.కాని దానికి విరుద్ధం గా ఉంది విషయం. మొన్నటికి మొన్న ఆడవాళ్ళని కించపరిచేలా కామెంట్లు,ఆ పైన రోమియో మాదిరి గా క్రికెట్ గ్రౌండ్ లో చొక్కా విప్పి ధూమపానం చేస్తూ పోజుకొట్టడం,ఈ మధ్యనే కె.సి.ఆర్. కి సినిమా ఇన్విటేషన్ ఇస్తూ నెత్తి మీద కి కళ్ళ జోడు పెట్టుకొని పోజు ఇవ్వడం..ఇవన్నీ ఆయన అజ్ఞాన ,అహంకార ధోరణులకి నిదర్శనం. వీళ్ళ చుట్టూ ఉండే కోటరి కూడా అలాంటిదే.ఎంత మర్యాద గా ,సభ్యత గా ప్రవర్తిస్తే తాము అంత చులకన అయిపోతానేమొనని వీరి సగం మెదడు లోని ఆలోచన.అభిమానులు కూడా
 ఇవి చూసి అదే గొప్ప లా ఫీలవ్వడం.అది ఇంకా దుర్దృష్టకరం.తమ పార్టి అధికారం లోకి వచ్చింది అంటే తమ కులానికి అధికారం జనాలు ఇచ్చారనే భ్రమలో మన నేతలు ఉండడం విచారకరం.దాన్ని తైనాతీ  పత్రికలు,వర్గాలు పోషించడం ఇంకా ఘోరం.ఆ మధ్య పద్మ అవార్డ్ ల నామినేషన్ లు ఒకే వర్గం వారివి  సెంటర్ కి పంపించడం కూడా కరుడు గట్టిన కుల అహంకారానికి నిదర్శనం. అంటే మిగతా ప్రజల ఓట్లు లేకుండానే వీరు గద్దెనెక్కారా..?

తెలంగాణా ని ఇచ్చిందనే ఎమోషన్ లో కాంగ్రెస్ ని కోస్తా లో తుడిచి పెట్టడం కూడా అర్ధ రహితం.ఆ పార్టీ గాకపోతే బి.జె.పి.అయినా ఇచ్చేదే.చంద్ర బాబు నుంచి వెంకయ్య దాకా తెలంగాణా ని దొడ్డిదోవలో సమర్దించినవారే,ఆ మేరకు అక్కడ రాసిచ్చిన వారేగదా.దాదాపు మూడేళ్ళకి దగ్గర్లో పడుతున్నది,కేంద్రం ఆంధ్ర పట్ల సవతి తల్లి ధోరణి నే ప్రదర్శిస్తున్నది.నరేంద్ర మోడి కి ప్రతిదీ తెలుసు..తనని గతం లో ఎలా తూలనాడింది..గుజరాత్ ఘర్షణల్లో అవలంబించిన వైఖరి..అదంతా..!మళ్ళీ ఇప్పుడు అవసరార్ధం ఏదో మెచ్చుకోలు కబుర్లు చెబితే కరిగిపోయే వ్యక్తి కాదాయన.పెద్ద పెద్ద అంతస్తులున్న ఫోటోల్ని  చూపిస్తూ..ఇదిగిదిగో ఇలా ఉంటుంది మన రాబోయే రాజధాని అంటూ ఊరించటమే తప్ప జరుగుతున్నదేమీ లేదు.

 

  

30, మార్చి 2016, బుధవారం

సంతోషం..మాలిక అగ్రిగేటర్ పనిచేస్తొంది ఈ రోజు చూస్తే..!


గతం లో అంటే ఈ నెల 24 న నేను పెట్టిన పోస్ట్ లో మాలిక అగ్రిగేటర్ పని చేయకపోవడం తో కించిత్ బాధ తో ఆవేదన చెందాను.అయితే ఈ రోజు చూస్తే చక్కగా పని చేస్తున్నది.చాలా సంతోషం..ఇలాగే మాలిక పది కాలాల పాటు వర్దిల్లాలి.

24, మార్చి 2016, గురువారం

"మాలిక" అగ్రిగేటర్ ఓపెన్ కావడం లేదు..అందరిదీ అదే అనుభవమా..?


నిన్నటి నుంచి మాలిక అగ్రిగేటర్ ఓపెన్ కావడం లేదు..పైగా ఎర్ర రంగు లో ఏదో హెచ్చరిక లాగానూ..ఫిషింగ్ సైట్ అంటూ వస్తోంది.ఇంతకీ ఏమైంది..ఈ అగ్రిగేటర్ కి..కూడలి లాగానే మూతబడుతుందా ఏమిటి... ? ఎవరికి వారు ఏ సామాజిక మాధ్యమం లోనో బ్లాగ్ ని షేర్ చేసుకోవడం మంచిదనుకుంటా.అంతే కాకుండా కొన్ని మంచి బ్లాగుల్ని బుక్ మార్క్ చేసుకోవడం  మంచిది. తెలుగు బ్లాగు ప్రపంచం లో ఇంకా కొన్ని  చక్కని బ్లాగు లు ఉన్నాయి.దాంట్లో సందేహం లేదు.తెలుగు అగ్రిగేటర్లు మూతబడాలి అని కొన్ని చీకటి శక్తులు పని చేస్తున్నట్లు అనిపిస్తోంది.ఇక బ్లాగ్ వేదిక ,పూదండ లే మిగిలాయి.ఇవి కూడా కొత్త వాటిని చేర్చుకుంటున్నటు గా లేదు.ఏది లేని చోట ఆముద వృక్షమే మాహా వృక్షం మరి...! 

12, మార్చి 2016, శనివారం

రచయితల కష్టాన్ని దోచుకునె మగానుభావులు....


ఇటీవల ఒక రైలు ప్రయాణం లో ఒకాయన .పేరెందుకులే గాని ఓ రచయిత  పరిచయం అయ్యాడు.మాటల మీద అవీ ఇవీ మాట్లాడుతూ రచయితల కష్టాన్ని దోచుకునే బుక్ సెల్లర్స్ గురించి  చెప్పుకొచ్చాడు.తాను రెండేళ్ళ క్రితం వెలువరించిన ఒక పుస్తకం బాగానే రీడర్స్ లోకి వెళ్ళిందని కాని అమ్మడాకిచ్చిన బుక్ హౌస్ వాళ్ళు మాత్రం ఒక్క పైసా ఇవ్వలేదట.ఎప్పుడు అడిగినా కప్పదాటుడు సమాధానం ఇస్తున్నారని చెప్పాడు.పోనీ మీరే అమ్ముకోవచ్చుగా ..అన్నప్పుడు ..అన్ని ప్రాంతాల వాళ్ళకి  బుక్ అందుతుందని వాళ్ళకి ఇస్తాం...దాని ఆసరా చేసుకొని నిలువు దోపిడి చేస్తున్నారు..ఈ సారి పుస్తకం వేసినప్పుడు ఉచితం గానైనా జనానికి పంచుతాను గాని ఈ కొత్తరకం దోపిడీ దారులకి మాత్రం ఇవ్వనని చెప్పాడాయన.కేరళ లో మాదిరి గా రచయితలు కోపరేటివ్ సొసైటీలు స్థాపించుకుని అమ్మకాలు చేసుకోవచ్చును.ఆ దిశగా ఆలోచించుకొండి అని ఓ ఉచిత సలహా పారేశాను.మొత్తానికి అందరి కష్టాలు గురించి రాసే  రచయితలు ఈ ఇతివృత్తాల్ని కూడా తీసుకొని రాస్తే బాగుంటుందేమో ..!

10, మార్చి 2016, గురువారం

విజయ్ మాల్య ప్రస్తుతం అక్కడున్నట్లు సమాచారం...



9000 కోట్ల రూపాయల కుచ్చు టోపీని 17 బ్యాంక్ ల నెత్తిన పెట్టి చల్లగా విదేశాలకి జారుకున్న విజయ్ మాల్య లండన్ కి గంట ప్రయాణం లో ఉన్న ఓ గ్రామం "Tiwen"  లో ఉన్నట్లు ఒక మీడియా సంస్థ తెలిపింది.నిన్న కూడా సాయంత్రం ఒక పబ్ కి వెళ్ళాడుట.ఆ లొకేషన్ లో ఎక్కువగా ధనికులు నివసిస్తూంటారు..అడుగడుగునా నిఘా నేత్రాలు ఉంటాయి.ఎవరినైనా అడిగినా సమాధానం ఉండదు.ఆ పార్టీ మీద ఈ పార్టీ ,ఈ పార్టీ మీద ఆ పార్టీ దుమ్ముపోసుకున్నట్లు కనిపిస్తుంటాయి గాని ఇలాంటి పెద్ద స్థాయి అక్రమార్కుల్ని రక్షించడం లో తలా ఓ చెయ్యి వేస్తారు.ఎందుకంటే మన దేశ పాలనా విధానం అది.రాజ్యాంగం లో చట్టం ముందు అందరూ సమానులు అని రాసుకోగానే కాదు.అది అమలు అయ్యేట్టు చూడగల దమ్ము ప్రజల్లో కూడా ఉండాలి.అసలు అంటే కోపం గాని ప్రజాస్వామ్యం అనే పద్ధతే మన దేశానికి సరిపడదు.రోమ న్ ల గ్రీక్ ల కాలం నుంచి ప్రజాస్వామ్య  విత్తనాలు యూరపులో పాదుకొని ఉన్నాయి.ఆ ప్రజా చైతన్యం వేరు.సామాజికంగా ఎక్కువ అంతరాలు లేని సమాజాల్లో ,ప్రజలు అవసరమైతే అంతర్యుద్ధం ప్రకటించే చైతన్యపూరిత వాతావరణం లో ప్రజాస్వామ్య పరిణితి వేరు.ఇక్కడ మనదగ్గర బయటకి పార్టీలు వేరు గా కనిపించవచ్చు గాని అక్రమార్కుల్ని పట్టుకుని శిక్షించడం లో అన్నీ అన్నే.అధికారం లోకి రావడం భూములు ,ఆస్తులు పెద్ద ఎత్తున వెనకేసుకోవడం మళ్ళీ పైకి సుద్దులు వల్లించడం..అన్నీ తెలిసీ సర్దుకొని అలా పోవడం మనకి అలవాటయిపోయింది.ఇక మన కోర్ట్ ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.