Pages

1, మే 2014, గురువారం

మనలో మన మాట...43 ఏళ్ళ ఆ పడుచు అమృతా రాయ్ ఈ 67 ఏళ్ళ వానిలో చూసినది ఏమిటో..?

డిగ్గీ రాజా ప్రేమ కథ ఏ తీరానికి చేరనుందో..?

67 ఏళ్ళ దిగ్విజయ్ సింగ్ ఇన్నాళ్ళు మంచి హుందా ,గంభీరత తో అందరికీ రకరకాల సుద్దులు చెబుతుంటే అబ్బో ఏదో విషయమున్న మనిషే అనుకున్నాం.తీరా అయ్యగారి బ్యాక్ గ్రౌండ్ స్టోరి బయటకి వచ్చి ముద్దుగుమ్మ ముద్దాడుతున్న ఫోటోలు నెట్ లోకి వచ్చేసరికి ఏయ్ అదంతా నా ప్రైవేట్ వ్యవహారం ..జనాలు మాట్లాడడం నాకు నచ్చదు అంటూ హుంకరిస్తున్నాడు.

మనలో మన మాట...43 ఏళ్ళ ఆ పడుచు అమృతా రాయ్ ఈ 67 ఏళ్ళ వానిలో చూసినది ఏమిటో..?.తనకంటే కొన్ని దశాబ్దాల వయసు తేడా ఉన్న స్త్రీలని పెళ్ళాడిన అందరి గాధలు విషాదాంతాలే.ఎందుకంటే వీళ్ళు శారీరకంగా వాళ్ళని సుఖపెట్టలేరు.వాళ్ళ మీద అనుమానాలు క్రమేపి పెరిగి అవి వింత కోణాలలో పయనిస్తాయి.పవరు,మనీ,అంతస్తూ పుష్కలంగా ఉన్న డిగ్గీ కి ఆ అమ్మాయిని లోంగదీసుకోవడం లెక్కలోది కాదు.ఆమె భర్త నుంచి విడదీసి అతని చేతనే మా కేమీ సంబందాలు లేవు అనిపించడం లెక్కలోదికాదు.దాని కోసం ఎన్ని పావులు అయినా వీరు కదపగలరు.ఎంతైనా అలాంటి కళలో అరితేరినవాడు డిగ్గీ.అందుకేగా ఆంధ్ర ప్రదేశ్ ని విడదీసే ప్రాజెక్ట్ మనోడికి అప్పజెప్పింది.

మొన్నటిమొన్న మోడి మీద తెగ ఎగిరాడు.భార్యని పట్టించుకోని వాడు దేశాన్నేం పట్టించుకుంటాడు అని.ఎన్.టి.ఆర్.లా భార్య చనిపొయిన తర్వాత అందరికి తెలిసేలా పెళ్ళి చేసుకుంటే అది భారతీయ సమాజం హర్షించేది.పోనీలే ఓ తోడు అవసరమేకదాని అనుకొనేవారు.కాని నెట్ లో తమ శృంగార చిత్రాలు విహారం చేయడం మొదలెట్టినాక అవును ..ఆమెనే పెళ్ళిచేసుకోబోతున్నా అని అనడం అతి తెలివి.

ఇది మా ప్రైవెట్ విషయం అనడం కూడా  జనాలు ఒప్పుకోరు.పది మందికి ఆదర్షంగా ఉండవలసిన వాడు ...తాను మాట మాట కి ప్రవచించే  భారతీయ ధర్మానికి కట్టుబడనివాడు మోసకారి కాకపోతే ఎవరు...!

బిల్ క్లింటన్ లాంటి వాడు తన తెరచాటు యవ్వారానికి సారీ చెప్పాడు.పనిలేకనా...దబాయించడం రాకనా..?ప్రజల్ని లీడ్ చేసే నాయకుడు క్లీన్ గా ఉండాలని అక్కడి సమాజం భావిస్తుంది.మాట్లాడితే లక్ష ధర్మ పన్నాలు చెప్పే భారతీయ రాజకీయాల్లో ఈ విలువల్ని ఇక్కడ ప్రజలు ఆశించడం తప్పు ఎలా అవుతుంది...?  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి